: సంజయ్ దత్ పెరోల్ గడువు మరో నెల పొడిగింపు
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నటుడు సంజయ్ దత్ పెరోల్ గడువు పెంపుకు పూణెలోని ఎరవాడ జైలు అధికారులు అంగీకరించారు. ఈ మేరకు నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 19 వరకు గడువు పెంచారు. భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం కారణంగా తనకు అనుమతి ఇవ్వాలని సంజయ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే నెల రోజుల పెరోల్ పై ఆయన డిసెంబర్ నుంచి బయట ఉన్న సంగతి తెలిసిందే.