: ప్రభాస్ గాయపడలేదు.. అన్నీ పుకార్లే: కృష్ణంరాజు
'బాహుబలి' చిత్రీకరణ సందర్భంగా ప్రభాస్ గాయపడ్డారని, కోమాలో ఉన్నారని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, అభిమానులు నమ్మవద్దని రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి చిత్రీకరణలో పాల్గొంటున్నాడని అన్నారు. ప్రభాస్ గాయపడ్డారంటూ వస్తున్న వార్తలు ఎవరో గిట్టని వారు పుట్టించిన వదంతులని ఆయన అన్నారు.