: విభజన పొందిన ప్రాంతాల దుస్థితి చూడండి.. అది పునరావృతం కానివ్వొద్దు: పయ్యావుల


రాష్ట్ర విభజన వల్ల నష్టమే తప్ప ఏ రకమైన ప్రయోజనం చేకూరదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన మరఠ్వాడా, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాంతాలు దేశంలోనే అత్యంత దారుణమైన వెనకబాటుతనంలోకి నెట్టివేయబడ్డాయని తెలిపారు. ఆయా ప్రాంతాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఆ అభివృద్ధికి కారణం సమైక్య రాష్ట్రం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మరోసారి విభజన పేరుతో రాష్ట్రానికి ఆ దుస్థితి రానివ్వవద్దని ఆయన కోరారు.

ఇప్పడు సీమాంధ్ర ప్రాంత ప్రజల అవకాశాల్ని దెబ్బతీసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏ హక్కు, అధికారం ఉంది? అని ఆయన నిలదీశారు. విడిపోయి కలిసి ఉందామని చాలామంది చెబుతున్నారని మనం గతంలో బరంపురంతో విడిపోయాం, ఎక్కడ కలిసి ఉన్నాం? అని ఆయన అడిగారు. విభజన అంటే విభజనే. అది అన్ని రకాలుగా జరుగుతుంది. అది సరికాదనే తాము చెబుతున్నామని పయ్యావుల అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం 'మా రాగిముద్ద'ను నిలుపుకునేది మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. 57 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులలో తెలంగాణ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని శ్రీకృష్ణ కమిటీ తెలిపిందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News