: మొహాలీలో కంగారెత్తించారు!
మూడో టెస్టులో భారత్ దుమ్మురేపుతోంది! ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (408)కు బదులిచ్చే క్రమంలో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (185 బ్యాటింగ్), మురళీ విజయ్ (83 బ్యాటింగ్) పరుగుల వర్షం కురిపించారు.
ముఖ్యంగా.. తొలి టెస్టు ఆడుతున్న ఢిల్లీ కుర్రాడు ధావన్ ధాటికి కంగారూలు తోకలు ముడిచారు! రికార్డుల హీరో ధావన్ బౌండరీల హోరు, విజయ్ డిఫెన్స్.. వెరసి భారత్ భారీ స్కోరుకు రంగం సిద్దం చేసుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 283 పరుగులు చేసింది.