: సోనియా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు: శైలజానాథ్
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో టీడీపీ నేత పయ్యావుల మాట్లాడుతూ, సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా గురించి మాట్లాడే అధికారం, అర్హత తెలుగుదేశం పార్టీకి లేవని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి కారణం టీడీపీయేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలనే విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే.. ఆ పార్టీ సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.