: వెనుకబాటుతనాన్ని చూపి విభజన చేయమంటారా?: పయ్యావుల


ప్రాంతం వెనుకబడిందన్న కారణం చూపుతూ విభజన చేయమంటారా? అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రశ్నించారు. అంటే వెనుకబాటుతనమే విభజనకు కొలమానమా? అని సూటిగా నిలదీశారు. అలాగైతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందని చెప్పారు. శాసనసభలో విభజన బిల్లుపై ఆయన ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. భాష, యాస, సంస్కృతులు వేరనే విష ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో వంద రోజులపాటు ఉద్యమం జరిగితే కనీసం కేంద్రం తిరిగి చూడలేదని మండిపడ్డారు. 'మా గోడు విననప్పుడు ఈ దేశంలో మేమెందుకు ఉండాలని' యువత ప్రశ్నిస్తోందన్న పయ్యావుల, రాయలసీమ యువత ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక హైదరాబాద్ తమదని చెప్పుకుంటున్న వారు దాని నిర్మాణంలో అన్ని ప్రాంతాల పాత్ర ఉందని మర్చిపోవద్దన్నారు. ఆంధ్రాలో పుట్టినవాళ్లంతా ద్రోహులనే మాటలు బాధిస్తున్నాయని, ఈ ప్రాంతం మాది.. మమ్మల్ని వలసవాదులని ఎలా అంటారు? అని మండిపడ్డారు. ఇక కోహినూరు వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కోసూరు గనుల్లో కాదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News