: బ్యాంకు లావాదేవీల పన్ను తీసుకొచ్చేట్లయితే కాంగ్రెస్ కు మద్దతు: రాందేవ్


బ్యాంకు లావాదేవీల పన్నును అమల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ అంగీకరిస్తే.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తానని యోగాగురువు బాబారాందేవ్ ప్రకటించారు. ఇప్పుడున్న అన్ని రకాల పన్నులను ఎత్తివేసి, బ్యాంకు లావాదేవీలపై ఒక శాతం పన్నును అమల్లోకి తీసుకురావాలని.. అలా అయితే కాంగ్రెస్ కు మద్దతిస్తానన్నారు. ఇలా చేస్తే భారీగా పన్నులు ఉన్న వంటగ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ వంటి ఉత్పత్తుల ధరలు చాలా వరకు తగ్గిపోతాయని బాబా చెప్పారు. ఈ నూతన పన్ను విధానం వల్ల ఏటా ప్రస్తుతం వస్తున్న 10 లక్షల కోట్ల రూపాయల పన్నుల ఆదాయం బదులుగా.. 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News