: బెంగళూరు సమీపంలో రాజేశ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా .. నలుగురి మృతి


కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో, హాసకోటె వద్ద ఈ రోజు ఉదయం రాజేశ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను బెంగళూరులోని ఎంఈజీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News