: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజనుడు కావాలి: కేంద్ర మంత్రి బలరాంనాయక్
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గిరిజనుడు కావాలని కేంద్ర మంత్రి బలరాంనాయక్ ఆకాంక్షించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా గిరిజనుడ్ని చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరానని అన్నారు. అలా చేయడం వల్ల ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సాధిస్తుందని ఆయన తెలిపానన్నారు.