: ఇంకా పెళ్లి చేసుకోలేదు.. త్వరలో చేసుకుంటాం: సినీనటి వనిత
కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తలను సినీనటి వనిత విజయకుమార్ ఖండించారు. దివంగత నటి మంజుల, విజయకుమార్ ల కుమార్తె వనిత 'మానిక్కం', 'చంద్రలేఖ' అనే రెండు చిత్రాల్లో నటించింది. తనకు, రాబర్ట్ కు మధ్య ఉన్న సంబంధం గురించి తన కుటుంబానికి తెలుసని, తామిద్దరం కలిసి ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. వనితకు ఇదివరకే తమిళ నటుడు ఆకాశ్ తోనూ, ఎన్నారై ఆనంద్ రాజ్ తోనూ వివాహం జరిగింది. వనిత వారిద్దరి నుంచి విడాకులు తీసుకుంది. వనితకు శ్రీహరి అనే కుమారుడు ఉన్నాడు. రాబర్ట్ తో తనకు ఇంకా పెళ్లి కాలేదని, త్వరలోనే పెళ్లి జరగనుందని వనిత తెలిపింది.