: బిల్లు తుది అంకానికి చేరుకుంది: లగడపాటి


విభజన అంశం తుది అంకానికి చేరుకుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ మనమంతా కలిసి పోరాడితే విభజనకు వ్యతిరేకంగా, సమైక్యతకు అనుకూలంగా శాసనసభలో మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిథిలోని 32 మంది ఎమ్మెల్యేలు సమైక్యవాదుల ఓట్లతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలలో బలహీనుడైన కేసీఆర్ కు ఒకరి తరువాత ఒకరు లొంగిపోయి విభజనకు కారకులవుతున్నారని, తెలుగు జాతి వీరిని క్షమించదని లగడపాటి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News