: వెంకయ్యనాయుడి నివాసంలో సంక్రాంతి సంబరాలు
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బీజేపీ సీనియర్ నేతలంతా వెంకయ్యనాయుడి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాల్లో సందడి చేశారు.