: ఉద్యోగాల పేరిట 45 లక్షలు వసూలు చేసిన అటెండర్


ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి అటెండర్ 45 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పశుసంవర్థక శాఖ కార్యాలయ అటెండర్ లలితాదేవిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉద్యోగాలిప్పిస్తానంటూ తమ వద్ద నుంచి 45 లక్షల రూపాయలు వసూలు చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసిందని, ఉద్యోగాల ఊసెత్తడం లేదని, పోనీ డబ్బులైనా చెల్లించాలని కోరితే దిక్కున్న చోట చెప్పుకోవాలని అంటోందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News