: ఒక ప్రాంతానికి ఖేదం..మరో ప్రాంతానికి మోదం సరికాదు: జేపీ
ఒక ప్రాంతానికి ఖేదాన్ని, మరో ప్రాంతానికి మోదాన్ని ఇవ్వడం సరికాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన పనులు వేరేవాళ్లు చేయలేరని అన్నారు. తెలుగు ప్రజలు పదేళ్లలో అభివృద్ధి చెందే ప్రణాళికలు తాను సూచించగలనని అన్నారు. సామర్థ్యంలో ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యాలు, నిరంతరాయ విద్యుత్, విద్య, ఉపాథి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రా వారిని తెలంగాణ వారు, తెలంగాణ వారిని ఆంధ్రావారు, తెలుగోళ్లను తమిళులు తిట్టుకోవడానికే సరిపోతుంది తప్ప, నిజమైన శ్రేయస్సు కోసం ఆలోచించడం లేదని మండిపడ్డారు. సంపదను పెంచే మార్గాలు అన్వేషించాలని సూచించారు. అందుకు సమర్థవంతమైన పార్టీ లోక్ సత్తా అని ఆయన వెల్లడించారు.