: తేనెటీగ విషంతో హెచ్ఐవీ నివారణ!


'హెచ్ఐవీకి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం' అని ప్రభుత్వాలు ఎయిడ్స్ ప్రచార కార్యక్రమాల్లో ఊదరగొట్టడం చూస్తూనే ఉంటాం. అయితే, వాషింగ్ టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తేనెటీగ విషంతో హెచ్ఐవీకి కళ్లెం వేయవచ్చంటున్నారు. నిస్సందేహంగా ఇది మానవాళికి శుభవార్తే కదూ. తేనెటీగ విషాన్ని అతి చిన్న అణువులుగా విడగొట్టి.. హెచ్ఐవీ కణాలపై ప్రయోగించారట.

తేనెటీగ విషంలో ఉండే ప్రమాదకర పదార్థం మెలిట్టిన్.. హెచ్ఐవీ కణాలతో పోరాడి వాటిని తుదముట్టించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెచ్ఐవీ కణాలపై ఉండే ప్రొటీన్ కవచం చాలా గట్టిగా ఉండడం వల్లే వాటిపై మందుల ప్రభావం కనిపించదని వారు తెలిపారు.

అయితే, మెలిట్టిన్.. హెచ్ఐవీ రక్షణ కవచానికి తూట్లు పొడవగలిగిందని ఆ శాస్త్రజ్ఞులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిశోధనలు హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే యాంటీ రెట్రో వైరల్ థెరపీలో విప్లవాత్మక పురోగతికి తోడ్పడతాయని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News