: సెంచరీ చేసిన కోహ్లీ
కష్ట సమయంలో క్రీజులో కుదురుకుని విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ చేశాడు. 98 బంతుల్లో 104 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. కోహ్లీకి తోడుగా ధోనీ కూడా చక్కగా రాణిస్తున్నాడు. 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో వీరిద్దరూ ఇన్సింగ్స్ ను చక్కదిద్ది పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం జట్టు స్కోరు 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 వద్ద ఉంది.