: గుంటూరు నుంచే పోటీ: గల్లా జయదేవ్


తాను వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు జయదేవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేసేదీ ఆయన స్పష్టం చేయలేదు. గల్లా జయదేవ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలఖారున తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News