: కోట్లకు టీజీ కౌంటర్


తనపై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి టీజీ వెంకటేశ్ తిరిగి వచ్చిన చోటికే వెళతారంటూ నిన్న సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో సూర్యప్రకాశ్ రెడ్డి తక్కువగా మాట్లాడితే మంచిదని టీజీ హితవు పలికారు. టికెట్ ఇవ్వలేదని పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన సంస్కృతి సూర్యప్రకాశ్ రెడ్డి ఒక్కడికే ఉంటుందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే కాంగ్రెస్ పార్టీని వీడతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విభజన జరిగితే కాంగ్రెస్ సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ ఖాళీ అవుతుందన్నారు.

  • Loading...

More Telugu News