: మండలిలో చర్చకు సీఎం... గ్యాలరీ నుంచి వీక్షిస్తున్న ఉండవల్లి
శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాసేపట్లో రానుండగా, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శాసన మండలి గ్యాలరీ నుంచి బిల్లుపై జరుగుతున్న చర్చను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ సమావేశానికి 8 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు హాజరుకాగా, తెలంగాణ ప్రాంత మంత్రులు గైర్హాజరయ్యారు.