: మార్చి 27 నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు
వేసవి మొదలవడం, త్వరలో పరీక్షలు ముగియనుండడంతో కళాశాలలకు సెలవుల పండగ వచ్చేస్తోంది. మార్చి 27 నుంచి రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 3 నుంచి విద్యార్ధులకు మళ్లీ తరగతులు మొదలవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.