: వ్యతిరేక స్వరం వినిపించిన బిన్నీపై వేటుకు వేళాయెనే
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీపై బహిష్కరణ వేటు పడే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ ప్రకటించవచ్చని సమాచారం. అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత అని, ప్రజల హామీలకు దూరంగా వెళుతున్నారని బిన్నీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై నిన్న కేజ్రీవాల్ స్పందిస్తూ.. బిన్నీ అసంతృప్తిగా ఉంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని ప్రకటించారు. మరోవైపు తనకు అందిన షోకాజు నోటీసుపై బిన్నీ భిన్నంగా స్పందించారు. తనకు ఏ క్లాజు కింద నోటీసు ఇచ్చారో తెలపాలని, పార్టీ రాజ్యాంగ ప్రతిని ఇవ్వాలని ఆయన కోరారు.