: 293 కొడితే గెలుపు భారత్ దే
న్యూజిలాండ్ లోని నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్యజట్టు భారత్ ముందు 293 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 292 పరుగులు చేసింది. విలియమ్స్ 71, టైలర్ 55, అండర్సన్ 68 పరుగులు చేశారు. ముఖ్యంగా చివర్లో అండర్సన్ 40 బంతుల్లో 68, రోన్చి 18 బంతుల్లో 30 పరుగులు సాధించడం వల్ల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ ఒక్కడే 4 వికెట్లు తీసుకుని ఫర్వాలేదనిపించాడు. మిగతా వారంతా ఒక్కో వికెట్ కే పరిమితమయ్యారు.