: రేపు ఐదేళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో
రేపు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆదివారం నాడు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణంలో ఉన్న వారికి వీలుగా బస్టాండులు, ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ కేంద్రాలను అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. 0-5 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు పేర్కొన్నారు. పోలియో నివారణకు అందరూ ముందుకు వచ్చి పోలియో రహిత భారత్ కు సహకరించాల్సిందిగా అధికారులు పౌరులను కోరుతున్నారు.