: 31న ఓటర్ల జాబితా ప్రచురణ: ఈవో భన్వర్ లాల్


ఓటర్ల జాబితా ముద్రణ ఈ నెల 31వ తేదీన జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాదులోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో ఈవో సమీక్షించారు. ఓటరు దరఖాస్తులను 21వ తేదీలోగా ఫోటోలతో సహా అప్ డేట్ చేయాలని, 23వ తేదీలోగా ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఓటరు నమోదు ప్రక్రియ వివరాలను ఆయన జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News