: సౌదీలో 1.4 మిలియన్ల భారత కార్మికుల క్రమబద్ధీకరణ
సౌదీ అరేబియాలో పని చేస్తున్న భారతీయ కార్మికుల్లో 1.4 మిలియన్ల మంది క్రమబద్ధీకరణ పొందారని, భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్ నారాయణ్ తెలిపారు. మరో 250 మందికి రెగ్యులరైజ్ కాలేదని, వారిని క్రమబద్ధీకరించేందుకు తమవంతు సాయం చేస్తున్నామని ఆయన అన్నారు. అక్రమంగా నివసిస్తున్నవారు, అంటే సరైన పత్రాలు లేకుండా సౌదీలో ఉంటున్నవారు దేశాన్ని విడిచి వెళ్లాలని సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా దేశాల ఎంబసీల నుంచి అనుమతులు పొందాలని సూచించింది. దీంతో భారతీయ కార్మికుల క్రమబద్ధీకరణ జరిగిందని ఆయన వివరించారు.