: సమైక్యాంధ్ర కొత్త పార్టీ వచ్చేసిందా..!


పశ్చిమ గోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ప్రచారాన్ని నిర్వహిస్తూ చైతన్య రథం తిరుగుతోంది. అంతే కాదు.. సమైక్యాంధ్రకు సంబంధించిన అంశాలను, ఆవశ్యకతను వివరిస్తూ 300 మంది కళాకారులు హరికథలు, బుర్రకథల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర గురించిన వివరాలతో వేల సంఖ్యలో కరప్రతాలు విడుదలై.. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చూసిన అధికార పార్టీ జిల్లా నేతలు సమైక్యాంధ్ర పార్టీ వచ్చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు ముందే విజయవాడలో.. సమైక్యాంధ్రకు సంబంధించి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటైన విషయం విదితమే.

  • Loading...

More Telugu News