: రాహుల్ తో స్నేహపూర్వక సమావేశం: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం సంతృప్తినిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ తో అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నానని ఆయన వెల్లడించారు. ఈ భేటీ ఆద్యంతం స్నేహపూర్వకంగా సాగిందని ఆయన చెప్పారు. ఇవాళ (శనివారం) న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడు బొత్స, డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాహుల్ ప్రసంగం స్ఫూర్తినిచ్చిందని, ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.