: తెలంగాణ ఇస్తామని బీజేపీ చెప్పడం రాజకీయ లబ్ధి కోసమే: వీహెచ్
సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసే ఉద్దేశ్యం తమకెంత మాత్రం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని వీహెచ్ పునరుద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ జాతీయ నేత రాజ్ నాథ్ చెప్పడం మాత్రం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన తేల్చి చెప్పారు. ఇవాళ ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆయన ధీమాగా చెప్పారు.