: అనూహ్య కేసులో హంతకులను బహిరంగంగా కాల్చేయాలి: పేర్ని నాని
ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ ను మట్టుబెట్టిన హంతకులను బహిరంగంగా కాల్చేయాలని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఇవాళ బందరులో అనూహ్య అంత్యక్రియలు జరిగిన విషయం విదితమే. అనూహ్య మృతిపై స్పందించిన పేర్ని నాని ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.