: శాసనసభ సోమవారానికి వాయిదా
శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే, కొన్ని రోజుల నుంచి సభ నుంచి వాకౌట్ చేస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు ఈ రోజు చర్చలో పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళం చెలరేగింది.