: ఐదువేల ఉద్యోగాలు తీసివేతకు 'ఇంటెల్' సిద్ధం!
అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇంటెల్ కార్పొరేషన్ 2014లో ఐదువేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాలిఫోర్నియాలోని శాంతా కార్లాలో ఉన్న సంస్థ కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది కూడా కంపెనీ లాభాలు పడిపోయిన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.