: సచిన్ క్రికెటర్ కాకపోయి ఉంటే..?
సచిన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తిగా ప్రపంచానికి సుపరిచితం. క్రికెట్ క్రీడలో అంతగా రాణించిన ఆయన ఒకవేళ క్రికెటర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు? డాక్టర్ అయ్యేవాడు, లేకపోతే టెన్నిస్ ప్లేయర్ అయ్యేవాడట. అవును, చెన్నైలో విద్యార్థులతో సమావేశం సందర్భంగా సచిన్ ఈ వివరాలను స్వయంగా వెల్లడించాడు. క్రీడలంటే తనకు ఎంతో ఆసక్తి అని.. క్రికెటర్ కాకపోతే టెన్నిస్ ఆటగాడిని అయ్యేవాడినని చెప్పాడు. ఆ తర్వాత వైద్యునిగా పనిచేసేందుకే తాను మొగ్గుచూపేవాడినని సచిన్ పేర్కొన్నాడు.