: కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న పెట్రోల్ బంక్ జప్తు
ఆదిలాబాదు పట్టణంలోని తెలంగాణ చౌక్ సమీపంలో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్న జి.ఎన్.రావు పెట్రోల్ బంకును జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత్ రావు దేశ్ పాండే జప్తు చేశారు. అనంతరం ఆయన జప్తునకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. కల్తీ పెట్రోలును అమ్ముతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయని.. దాంతో పెట్రోల్ బంకు నుంచి పెట్రోలు నమూనాలను సేకరించి లేబరేటరీకి పంపించామని ఆయన చెప్పారు. లేబరేటరీ రిపోర్టుల ఆధారంగానే.. బంకును జప్తు చేసి కేసు నమోదు చేసినట్లు వసంత్ రావు వెల్లడించారు.