: ప్రేమికురాలిపై విద్వేషం
అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటావా? లేదా? అని వెంటపడ్డాడు. అతడంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు. అందుకే ఆమె వేరే వాడితో పెళ్లి కుదుర్చుకుంది. దాంతో ఆ భగ్న ప్రేమికుడు పట్టా సురేష్ రగిలిపోయాడు. అప్పటి వరకూ ప్రేమించిన ఆ యువతిపై ద్వేషం చిమ్మాడు.
యువతి ఫొటోలను వాటిని గ్రాఫిక్స్ సాయంతో నగ్నంగా మార్చి ఫేస్ బుక్, ఇతర సైట్లలో అప్ లోడ్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఆమె వివరాలు, ఫోన్ నంబర్ కూడా ఆ ఫొటోలతో పాటు పెట్టాడు. దీంతో యువతికి అసభ్య కాల్స్ రావడం ప్రారంభమైంది.
అసలు విషయాన్ని గుర్తించిన ఆ యువతి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోని సైబర్ విభాగ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఫొటోలను అప్ లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు పట్టా సురేష్ ను అరెస్ట్ చేశారు. అతడి ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు.