: నిఘాపై మెట్టు దిగిన ఒబామా
నలువైపుల నుంచీ వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో.. అమెరికన్లు, విదేశీయుల వ్యక్తిగత వివరాలను రహస్యంగా సేకరించే నిఘా కార్యక్రమాన్ని సరళీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ముఖ్యంగా విదేశీయుల వ్యక్తిగత వివరాలకు మరింత రక్షణ కల్పిస్తామన్నారు. అలాగే, రాష్ట్రాలు, ప్రభుత్వాధికారులు, అమెరికా భాగస్వామ్య దేశాలు, మిత్ర దేశాధినేతల సంభాషణలను కూడా రికార్డు చేయమని చెప్పారు.