: ఢిల్లీ సీఎంకు కొత్త నివాసం కేటాయించిన కేంద్రం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మూడు పడక గదుల ఫ్లాట్ (త్రిబుల్ బెడ్ రూమ్) ను కేటాయించింది. కేజ్రీవాల్ సొంత నియోజకవర్గంలో తిలక్ లేన్ లో ఉన్న భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ కేటాయించింది. దానికి పక్కనే కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ఓ చిన్న పార్కు కూడా ఉంటుందని శాఖ తన వెబ్ సైట్ లో వివరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతోనే ఇలాంటి ఫ్లాట్ ను కేటాయించామని పేర్కొంది. త్వరలో ఈ ఫ్లాట్ కు కేజ్రీవాల్ కుటుంబం మారనుంది.