: సునంద రెండు రోజులుగా మద్యం, సిగరెట్లతోనే గడిపారు
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతికి రెండు రోజుల ముందు నుంచి ఆహారం తీసుకోకుండా కేవలం మద్యం, సిగరెట్లు, నిద్రమాత్రలతోనే గడిపారని ఆయన సిబ్బంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కు తెలిపారు. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో తన భర్తకు సంబంధం ఉందనే ఆవేదనతో ఆమె తీవ్రంగా మానసిక వేదనకు గురైనట్టు తెలిపారు. అందుకే ఆమె మద్యం, సిగరెట్లతోనే కాలం గడిపారని వారు స్పష్టం చేశారు. మృతి చెందడానికి ముందు ఢిల్లీలోని ఓ సీనియర్ జర్నలిస్టుకు ఎస్ఎంఎస్ ఇచ్చారని, అందులో మీడియాతో చాలా మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు.