: డబ్బులు అడిగితే చంపుతామంటున్నారు: హీరోయిన్ సంజన


సినీనటి సంజనకు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో సినీనటిగా వెలుగొందుతున్న సంజన.. 2012లో తన కుటుంబ స్నేహితుడు రాజీవ్ మల్హోత్రా కుమారుడు ప్రసాద్ మల్హోత్రా 13.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, చెల్లించాలని కోరగా మరింత సమయం అడిగారని తెలిపారు. అప్పటికీ చెల్లించకపోవడంతో నిలదీస్తే చెక్ ఇచ్చారని తెలిపారు. అది బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయిందని, ఇప్పుడు డబ్బు చెల్లించాలని అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణం వారిపై చర్యలు తీసుకుని తన డబ్బు తనకు ఇప్పించాలని సంజన తెలిపింది.

  • Loading...

More Telugu News