: ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై సీబీఐ దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. 2009లో హర్యానా వేర్ హౌస్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఖేమ్కా గుజరాత్ కు చెందిన ఓ సంస్థకు రూ.8 కోట్ల ప్రాజెక్టు కేటాయించారు. నిబంధనలు, షరతులు మార్చి ప్రాజెక్టుకు అనుమతి లేకపోయినా ఆమోదం తెలిపారని ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో... వెంటనే హర్యానా ప్రభుత్వం గతేడాది విచారణ కూడా జరిపించింది. అటు కేసు కూడా నమోదైంది. మరోవైపు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారంలో తలదూర్చిన ఖేమ్కాకు పలుసార్లు బదిలీ కూడా అయింది.