: షారుక్ ఖాన్ బాడీగార్డ్ పై ఫిర్యాదు చేసిన మరాఠీ నటి


నటుడు షారుక్ ఖాన్ అంగరక్షకుడు రవిపై బాంద్రాలోని కుర్లా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ముంబైలో జరిగిన సినీ అవార్డుల ప్రదానోత్సవంలో వేదిక వెనుక నుంచి వెళుతున్న మరాఠీ నటి శర్వారీని షారుక్ రక్షకుడు అడ్డుకున్నాడు. తనకు అనుమతి ఉందని చెప్పినప్పటికీ అతడు వినలేదు. కార్యక్రమానికి ఎక్కువమంది రావడంతో వారిని మేనేజ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా తోసివేయడంతో ఆమె కిందపడింది. దాంతో, ఆగ్రహించిన నటి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై వెంటనే అతడిని ప్రశ్నించిన పోలీసులు హెచ్చరించి వదిలిపెట్టారు. అయితే ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News