: తెలుగుదేశం పార్టీ నా రక్తంలో భాగం: జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ తన రక్తంలో భాగమని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. నేడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 18 వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వేకువజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు నివాళులు అర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్టీకి ప్రచారం చేయవలసిన బాధ్యత తన మీద ఉందన్నాడు. నటన తనకు బతుకుదెరువును ఇస్తోందని తెలిపిన ఆయన, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.