: ఆధార్ విషయంలో కేంద్రప్రభుత్వానికి మంత్రి లేఖ
వంట గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు లేఖ రాశారు. వంటగ్యాస్ సరఫరాకు ఫిబ్రవరి 15వ తేదీలోపు ఆధార్ సమర్పించాలని కేంద్రం షరతు విధించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఈ నిర్ణయం అమలుకు మరికొంత సమయం పడుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో ఆధార్ సమర్పించేందుకు మరికొంత కాలం గడువు కావాలని కోరుతూ శ్రీధర్ బాబు లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.