: 'రేయ్' ఆడియో వేడుక షురూ.. కాసేపట్లో సందడి చేయనున్న పవన్ కల్యాణ్
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సినిమా 'రేయ్' పాటల వేడుక మాదాపూర్ లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ ఆడియో వేడుకకు కాసేపట్లో ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ రానున్నారు. బొమ్మరిల్లు పతాకంపై సాయిధరమ్ తేజను నటుడిగా పరిచయం చేస్తూ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి రేయ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం చక్రి అందించారు. సినిమా ట్రైలర్, స్టిల్స్ ఇప్పటికే మెగా అభిమానులను అలరిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రానుండడంతో ఈ ఆడియో వేడుకకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.