: ముషారఫ్ ను అరెస్టు చేయాలన్న పిల్ కొట్టివేత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను అరెస్టు చేయమంటూ దాఖలైన పిటిషన్ ను ఆ దేశ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్ ను అరెస్టు చేయాలని ఆదేశాలివ్వాలంటూ ప్రాసిక్యూషన్ లాయర్ అక్రం షేక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగ్గురు జడ్జిలతో కూడిన కోర్టు కొట్టివేసింది. కాగా, కొన్ని రోజుల కిందట గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయనను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు చికిత్స కోసం అమెరికా వెళ్లాలని ముషారఫ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్ దాఖలు చేసిన లాయర్.. దేశం విడిచి ముషారఫ్ వెళితే బాధ్యత ఎవరిదని న్యాయస్థానాన్ని ప్రశ్నించారు.