: క్వీన్ ఎలిజబెత్ కి మునిమనవరాలు పుట్టింది
బ్రిటన్ మహరాణి ఎలిజబెత్-2 ఇంట మరో మహారాణి జన్మించింది. రాణి ఎలిజబెత్ మనవరాలు జారా ఫిలిప్స్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గ్లోసిస్టర్ రాయల్ ఆసుపత్రిలో 3.5 కేజీల బరువుతో ఆడబిడ్డ పుట్టినట్టు బకింగ్ హమ్ ప్యాలెస్ తెలిపింది. ఈ సమయంలో రగ్బీ ఆటగాడైన జారా భర్త మైక్ తిండాల్ ఆమె ప్రక్కనే ఉన్నాడని, ఐదు నెలల క్రితం ప్రిన్స్ జార్జ్, కేట్ మిడిల్టన్ లకు బిడ్డపుట్టి రాజవంశంలో ఆనందాన్ని నింపితే ఇప్పుడీ బిడ్డ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసిందని రాజవంశం తెలిపింది.