: ఖైదీలకు ఫోన్ సౌకర్యం: జైళ్ల శాఖ డీజీ


రాష్ట్రంలోని కారాగారాల్లో ఖైదీల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఏలూరులో జిల్లా జైలులో తనిఖీలు నిర్వహించి, ఖైదీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉన్న కేంద్ర, జిల్లా, సబ్ జైళ్లలో సిబ్బంది కొరత ఉందని, కొత్తగా నియామకమైన సిబ్బందికి శిక్షణ ఈ నెలాఖరుకి పూర్తవనుందని అన్నారు. ఖైదీల సౌకర్యార్థం ఇటీవల చర్లపల్లి జైలులో ఫోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, ఆ ప్రయోగం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విధానాన్ని మిగతా జైళ్లకు విస్తరించనున్నామని.. రాజమండ్రి, విశాఖ, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో ఫోన్లను ఏర్పాటు చేస్తున్నామని డీజీ తెలిపారు. ఆయన వెంట జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తదితర అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News