: విజయవాడలో సందడి చేసిన జూ.ఎన్టీఆర్


సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడలో సందడి చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహిస్తున్న ఫెస్టివల్ సీజన్-3 ప్రివ్యూ కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో మహాత్మగాంధీ రోడ్డులోని గేట్ వే హోటల్ వద్దకు చేరుకున్నఎన్టీఆర్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన కొద్దిసేపు వారితో మాట్లాడి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం మలబార్ గోల్డ్ బ్రాండుకు ప్రచారకర్తగా ఉన్నారు.

  • Loading...

More Telugu News