: బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది: రాజ్ నాథ్ సింగ్


భారతీయ జనతాపార్టీ (బీజేపీ)ని అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆఖరికి బీజేపీని లౌకికవాదానికి పెనుముప్పుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని... అసమర్థ పాలన, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని తెలిసే ఇలా మాట్లాడుతోందని ఆయన చెప్పారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఆ పార్టీ నానా తంటాలు పడుతోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News