: ఎన్నికల్లో లబ్ధి కోసమే సిలిండర్ల పెంపు నాటకం: షానవాజ్ హుస్సేన్
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ల పెంపు నాటకమాడుతోందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైనప్పుడు కాకుండా..ఇప్పుడు రాయితీ సిలిండర్ల సంఖ్యను పెంచడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏం అడిగినా చేసేటప్పుడు... నిర్ణయాలు తీసుకునే సమయంలో, బిల్లులు రూపొందించే సమయంలో రాహుల్ నే అడిగితే సరిపోయేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే ధైర్యం కూడా చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగుతోందని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ కాదని, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు.