: తిరుమలేశుని దర్శన టిక్కెట్లు విక్రయ కేసులో నలుగురి అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లు విక్రయించిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తిరుపతి వాసులు కర్ణ (44), దామోదరం (35), హరిబాబుతో పాటు ఒంగోలుకు చెందిన మాధవరావు (28) అరెస్టయ్యారు. నిందితులను ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 30వ తేదీ వరకు రిమాండు విధించారని ఎస్.ఐ మల్లికార్జున తెలిపారు. ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా విచారించి, దర్శన దళారులుగా మారిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులను అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.